భక్తులు విధిగా మాస్క్ లు ధరించాలి..! 19 h ago
తిరుమలలో జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 10న ఉదయం 4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ’అన్ని ప్రత్యేక దర్శనాలను 10రోజులు రద్దు చేశామని తెలిపారు. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్పారు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. HMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి’ అని చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.